నవతెలంగాణ – వీర్నపల్లి
వీర్నపల్లి మండలం జవహర్ లాల్ తండ గ్రామం పాత చెరువు కట్ట వద్ద కరెంటు పోల్ పై వైర్లుకు చెట్ల పొద ఆల్లుకోవడంతో ప్రమాదకరంగా మారింది. కరెంట్ పోల్ చుట్టూ పిచ్చి మొక్కలు, ఇతర మొక్కల తీగలు ఏపుగా అల్లుకున్నాయి. తండా వాసులు వివిధ పనుల నిమిత్తం ఈ పక్కనే రాకపోకలు సాగిస్తున్నారు. మొక్కలకు విద్యుత్ సరఫరా అయ్యి ప్రమాదం జరిగే అవకాశాలు లేకపోలేదు. అటువైపు వెళ్లే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్‌శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి కొమ్మలు తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.