ఉమెన్ హెల్త్
నమస్కారం అండీ! అందరూ కులాసాగా ఉన్నారని ఆశిస్తున్నాను. మీరు మీ భావోద్వేగ ఉత్ప్రేరకాల(ట్రిగ్గర్స్)ను గుర్తించారని భావిస్తున్నాను. మరి అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటున్నారా? మన ఉత్ప్రేరకాలను గుర్తించడం ఎంతో ముఖ్యం. గత వారంలో ఈ విషయంపై మాట్లాడుకున్నాం కదా! ఈ వారం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం…
ఈ ఉత్ప్రేరకాల గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు, మనకు వారిపై కోపం, అపోహలు ఏర్పడతాయి. ఈ అపోహల వల్ల క్షోభ, resentment వంటి భావాలు పుట్టుకొస్తాయి. తద్వారా సంబంధాలు దెబ్బతింటాయి. దాంతో పాటు మన అవసరం తక్కువగా అనిపించవచ్చు. మానవ సంబంధాలలో దూరం పెరుగుతుంది. నిజానికి ఈ ఉత్ప్రేరకాలు మనపై ఎంత ప్రభావం చూపిస్తున్నాయో మనం గుర్తించలేం. ఉత్ప్రేరకం చలించినప్పుడు మనలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. గుండె వేగంగా కొట్టుకోవడం, ముఖం ఎర్రగా మారడం, ఊపిరి పీల్చడం వేగం అవ్వడం వంటివి జరుగుతాయి. దీనిని heightened emotional state లేదా fight or flight response అంటారు. ఈ సందర్భంలో flight mode గురించి కూడా మాట్లాడాలి.
తార్కిక ఆలోచన కోల్పోతాం
flight mode వెళ్లినప్పుడు, మనం తార్కిక ఆలోచనలను కోల్పోతాము – శాస్త్రీయంగా దీనిని”amygdala hijack” అంటారు.rational brain పనిచేయడం ఆగిపోతుంది.emotional brain మాత్రమే స్పందిస్తుంది. అందువల్ల flight mode ఉన్నప్పుడు మనం awareness అవరర కలిగి ఉండడం మొదటి దశ. తరువాత pause (దీర్ఘంగా శ్వాస తీసుకోవడం, పది నుండి ఒకటి వరకు లెక్కపెట్టడం) చేయడం, భావాన్ని గుర్తించడం, నెమ్మదిగా భావాన్ని అనుభవించడం, నర్వస్ సిస్టమ్‌ను సమీకరించడం ద్వారా మన భావాలు సులభంగా విడుదల అవుతాయి. ఈ విధానం ద్వారా మనం చాలా అసౌకర్యకరమైన పరిస్థితులను నివారించగలుగుతాం. ఇతరులను బాధపెట్టడం నివారించగలుగుతాం. అలాగే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మన భావాలను అర్థం చేసుకుని బయటి పరిస్థితుల ప్రభావం లేకుండా మనం బలంగా ఉండగలుగుతాం.
ఆలోచనలను మార్చు కుందాం
ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఎప్పుడూ బయటి పరిస్థితులను మార్చలేము. కానీ మనలోపల మార్పు చేయడం, లోటస్ ఆకుల వంటి భావాలను అభివృద్ధి చేయడం ఎంచుకోవచ్చు. మరింతగా మనం ఈ ప్రయాణంలో మన ఆలోచనలను మార్పు చేయడానికి కూడా ప్రయత్నించాలి. ప్రతీ రోజూ కొన్ని క్షణాలు మీకు నచ్చిన సాధనలను చేస్తూ, చిత్తశుద్ధిని పెంపొందించుకోండి. ధ్యానం, జ్ఞాన బోధనలు లేదా రికార్డు చేసిన భావనలు – ఇవన్నీ మన భావోద్వేగాలను గుర్తించడానికి సహాయపడతాయి.
మనపై దృష్టిపెడదాం
సారాంశం ఏమిటంటే మన ఉత్ప్రేరకాలను గుర్తించుకుందాం. amygdala hijack నుండి తప్పించుకోవడానికి pause చేయడం అభ్యసించుకుందాం. అసౌకర్యకరమైన పరిస్థితులను నివారించుకుందాం. చివరగా మనపైన దృష్టి పెట్టి, భావోద్వేగ మాస్టరీని పొందుదాం. దీని కోసం మనం ఈ రోజు మొదటి అడుగు వేద్దాం! ఈ ప్రయాణంలో మనం ఒకరికొకరు సహాయపడితే మన ప్రగతిని మరింత వేగవంతం చేయగలుగుతాం. ప్రతిదీ మన చేతిలోనే ఉంది. మనలోని శక్తిని కనుగొనవలసిన సమయం ఇది! మనందరం కలిసి ఈ యాత్రను అందంగా సాగిద్దాం.
Dr.Prathusha. Nerella
MD( General Medicine) CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician
Positive Psychologist certified Nutritionist
Diabetes And Lifestyle Expert
Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach.
Ph: 8897684912/040-49950314