యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామానికి చెందిన నెమిల గణేష్ (8) పుట్టుకతోనే శారీరక వికలాంగునిగా ఉన్నాడు. 2020 సంవత్సరం లో 70 శాతం శారీరక వికలాంగునిగా డాక్టర్ దృవీకరణ పత్రం కలిగి ఉన్నాడు. కానీ ఇంతవరకు గణేష్ కు వికలాంగుల పించన్ రావడం లేదని, కనీసం కూర్చోవడానికి వీల్ చైర్ కూడా అధికారులు అందించకపోవడంతో బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు కొడారి వెంకటేష్, సామాజిక కార్యకర్తలు ఎం డి ఇంతియాజ్, గడ్డం సత్యనారాయణ, ఎం డి ఫసీయొద్దీన్ , ఎండీ ఇస్తియాక్, పాక జహంగీర్ లు కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే వెంటనే స్పందించి వికలాంగ బాలుడు నెమిలే గణేష్ కు తక్షణమే వీల్ చైర్ ఇవ్వాలని డి డబ్లూఓ ను ఆదేశించారు. వికలాంగ బాలుడు గణేష్ కు వీల్ చైర్ అందజేసిన కలెక్టర్ కు సామాజిక కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.