కేసీఆర్‌ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలి : షబ్బీర్‌ అలీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హవాయి చెప్పులు వేసుకున్న మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు 50 మంది ఆస్తులపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌, ఆయన బావమరిది నార్కోటెస్ట్‌ చేయిం చుకుంటే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని అభిప్రాయపడ్డారు. డ్రగ్స్‌ అనగానే కేటీఆర్‌ ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు. రాజ్‌ పాకాల ప్రతివారం ఫామ్‌హౌజ్‌లోనే రేవ్‌ పార్టీ నిర్వహిస్తారని ఆరోపించారు. పక్కా సమాచారంతోనే పోలీసులు దాడి చేశారనీ, త్వరలో వాస్తవాలు ప్రజల ముందు పెడతామని తెలిపారు.

Spread the love