నవతెలంగాణ బ్యూరో హైదరాబాద్
తెలంగాణ సచివాలయంలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న 26 మంది ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. ఏడుగురు అదనపు కార్యదర్శులు, ఏడుగురు సంయుక్త కార్యదర్శులు, 12 మంది డిప్యూటీ కార్యదర్శులను, వారు పని చేస్తున్న శాఖల నుంచి ఇతర శాఖలకు బదిలీ చేసింది. బదిలీ అయిన అధికారులను వెంటనే రిలీవ్ చేసి కొత్త వారిని ఆయా శాఖలు విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.