నవతెలంగాణ – బెజ్జంకి
పట్టభద్రులందరూ బాధ్యతతో ఓటు నమోదు చేసుకోవాలని బీజవైఎం మండలాధ్యక్షుడు తూముల రమేశ్ యాదవ్ సోమవారం మండల కేంద్రంలో విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేల 2021 వరకు ఆదిలాబాద్,కరీంనగర్,మెదక్,నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని పట్టుభద్రులు శాసన మండలి ఎన్నికల్లో విధిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రమేశ్ యాదవ్ సూచించారు. ఓటు నమోదు సందేహాలకు 9652140602, 8374161001,9440022143 సంప్రదించాలని సూచించారు. నాయకులు రవి కుమార్,సాన వేణు,మహేష్ పాల్గొన్నారు.