నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని కల్లేపల్లి గ్రామ శివారులోని పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం దాడి చేశారు.గుంటూరుపల్లికి చెందిన సుమారు ఆరుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని రూ.3690 నగదు,6 మొబైల్ పోన్లను స్వాధీనం చేసుకున్నామని టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలకు వేనుకాడబోమని ఎస్ఐ క్రిష్ణారెడ్డి హెచ్చరించారు. పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.