ప్రస్తుతం ఇన్ఫెక్షను ఎక్కువయ్యాయి. పిల్లల్లను ఇలాంటి ఇన్ఫెక్షన్లు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. పసిపిల్లలకు ఆగకుండా దగ్గు వస్తే వెంటనే పిల్లల స్పెషలిస్ట్‌ను సంప్రదించాలి. డాక్టర్‌ను కలవడానికి మరింత సమయం పడుతుందనుకున్నప్పుడు కొన్ని చిట్కాలను పాటిస్తే పిల్లలకు ఊరట కలుగుతుంది. ఈ చిట్కాలను కూడా వైద్యులను సంప్రదించే పాటించాలి. దగ్గు చాలా రకాలుగా వుంటుంది. పొడి దగ్గు, కఫం దగ్గు, ఇలా రకరకాలుగా వుంటాయి. కొన్ని సందర్భాల్లో దగ్గితే రక్తం రావడం, మింగడానికి కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. పసికందులు, లేదా చిన్నారులు దగ్గినప్పుడు కఫం బయటకు వస్తుంది. వారి శరీరం హైడ్రేటెడ్‌గా వుండేలా చూసుకోవాలి. లేదంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ పరిస్థితిలో తల్లిపాలనివ్వడం శ్రేయస్కరం.
పసికందు ముక్కులో ఓటీసీ సెలైన్ డ్రాపులు వేయవచ్చు. ఒక ముక్కు రంద్రంలో రెండు లేదా మూడు సెలైన్ డ్రాపులు వేయాలి. అలాగే వారి ముక్కులో కఫాన్ని క్లీన్ చేస్తూ వుండాలి. దీని కోసం చిన్న సక్షన్ ట్యూబులు వుంటారు. ఈ సక్షన్ ట్యూబుల సాయంతో పసిపిల్లల ముక్కులో మ్యూకస్ లేకుండా చూసుకోవాలి.
హ్యామిడిఫైయర్‌ను ఉపయోగించడం వల్ల పిల్లలకు వేడి గాలి వస్తుంది. ఈ వేడి గాలిని పీల్చడం వల్ల కఫంతోపాటు ఏదైనా వుంటే బయటకు వచ్చేస్తుంది, కరిగిపోతుంది. బాత్‌రూంలో హాట్ వాటర్ షవర్‌ని ఆన్ చేసి 10 నిమిషాలు బాత్‌రూంను క్లోస్ చేయాలి. అప్పుడు బాత్‌రూం లోపల వేడి గాలి మొత్తం నిండిపోయి వుంటుంది. బిడ్డను ఆ బాత్‌రూం లోకి తీసుకొని వెళ్లి చాతిపై నిమరడం వల్ల కఫం బయటకు వస్తుంది.
సిగరెట్ తాగేవారిని పిల్లలకు దూరంగా ఉంచాలి. పిల్లలకు వాడే బట్టలు, పరుపులు నీట్‌గా వుండేలా జాగ్రత్తపడాలి. పిల్లలకు దగ్గు రావడానికి చాలా కారణాలున్నాయి. చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల దగ్గు ఎక్కువగా వస్తుంది. కొత్తరకాల వైరస్‌ల వల్ల కూడా దగ్గు వస్తుంది. నుమోనియా కూడా దగ్గు వచ్చేలా చేస్తుంది. కాబట్టి పిల్లలకు దగ్గు వస్తే తక్కువ అంచనా వేయకుండా వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలి.
చలికాలంలో పిల్లలకు దగ్గు ఎక్కువగా వస్తుంది. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దగ్గు బారిన పడకుండా వుంటారు. బేబీ మాయిశ్చరైజర్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించాలి. బేబీ చుట్టూ పరిశుభ్రంగా వుండేలా చూసుకోవాలి. బేబీ వున్న రూంలో ఉష్ణోగ్రత తగినట్లు వుండేలా, మరీ ఎక్కువ చలి లేకుండా జాగ్రత్త పడాలి.