- Advertisement -
నవతెలంగాణ- నాంపల్లి: ఓపెన్ ఇంటర్ 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ప్రభుత్వం గడువు పెంచిందని నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్, ప్రిన్సిపల్ గంధం మోహన్ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 31 వరకు ప్రవేశాలను పొందవచ్చని ఆయన తెలిపారు. ఆసక్తి, అర్హత గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కళాశాల అసిస్టెంట్ కోఆర్డినేటర్ ఎస్.శ్రీనివాస్ 9160389007 ను సంప్రదించాలని సూచించారు.
- Advertisement -