నవతెలంగాణ-చిన్నశంకరపేట
గోడ కూలి ఇద్దరు వలస కార్మికులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారం తండాలో నూతనంగా కోళ్ల ఫారం షెడ్డు నిర్మిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు గోడకూలింది. ఈ ప్రమాదంలో బీహార్, జార్ఖండ్‌కు చెందిన రసికుల్ అలాం, వషికుల్ అలాం అనే ఇద్దరు తాపీ మేస్త్రీలు అక్కడకక్కడే మృతి చెందారు. మరికొంతమంది కార్మికులకు తీవ్ర గాయాలవగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా ప్రభుత్వ దవాఖానాకు తరలించారు.