ఘనంగా చాచాజీ జయంతి వేడుకలు 

నవతెలంగాణ – ఆళ్ళపల్లి : పండిట్ జవహర్లాల్ నెహ్రూ చాచా జీ జయంతి వేడుకలు గురువారం ఆళ్ళపల్లి మండలంలోని పాతూరు గ్రామం ఎంపీయూపీఎస్ లో ఘనంగా నిర్వహించారు. దీనికి గాను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎస్ఎంసీ కమిటీని సమావేశపరిచారు. అలాగే పిల్లలకు ఆటలు, పద్యాలు, కథలు, దేశభక్తి గేయాలు, ఏక పాత్రాభినయాలు, తదీతర పోటీలు నిర్వహించి, మంచి ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ,  తృతీయ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఎం బి.వీరన్న, ఉపాద్యాయులు ఇస్లావత్ హతిరామ్, భావ్ సింగ్, మోహన్, గ్రామస్తులు రమణ, పద్మ, సమ్మక్క, రామయ్య, రాణి, మైన, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love