ఎన్నికలలో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈ.వి.ఎం.) ట్యాంపరింగ్ చేయబడవని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని జిల్లా ఎన్నికల అధికారి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికలలో పేపర్ బ్యాలెట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టి వేసిందని, ఈ.వి.ఎం. ట్యాంపరింగ్ పై పిటిషనర్ చేసిన వాదనలను న్యాయస్థానం తిరస్కరించిందని తెలిపారు. ఎన్నికలలో ఓడిపోయినప్పుడు మాత్రమే ఈ.వి.ఎం.ల విశ్వసనీయతను ప్రశ్నించే నాయకుల అస్థిరతను ఎత్తి చూపిందని తెలిపారు.