
ముదిగొండ వెంకటేశ్వర్లు ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు హాలియా పట్టణ కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు ముదిగొండ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మాదిగలకు మంత్రివర్గంలో స్థానం లేకుండా ఏ ప్రభుత్వాలు చేయని మోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రాష్ట్రం లో మాదిగల జనాభా లెక్కల ప్రకారం తక్షణమే మాదిగలకు హోం మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ. అదేవిధంగా ఆగస్టు 01 వ తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చిన తీర్పును ప్రతి రాష్ట్రం అమలు చేయాలని అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26 లోపు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని , ఈ విద్యా సంవత్సరంలో ఇచ్చిన ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ లో ఎస్సీ వర్గీకరణను అమలు చేసి ప్రతి మాదిగ బిడ్డకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కమిషన్ తో కాలయాపన చేయకుండా మాదిగలను మోసం చేయాలని చూస్తే వచ్చే స్థానిక, పంచాయతీ, మున్సిపల్, ఎన్నికలలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల నాయకులు ఆదిమల్ల శ్రీనివాస్, ముదిగొండ శివ కుమార్ , పట్నం విజయ , తెలకపల్లి శివ , కొండ మహేందర్ , తక్కెలపల్లి నిత్య , కొండల్ రాకేష్ జస్వంత్ కుమార్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.