కాంట అయిన వెంటనే రైతుకు రశీదు ..

Receipt to the farmer immediately after harvesting..– కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వరిదాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు కాంట నిర్వహించిన వెంటనే నిర్వాహకులు ధాన్యం విక్రయించిన రైతుకు రశీదు ఇవ్వడం జరుగుతుందని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య అన్నారు. మంగళవారం మండలంలోని ఆన్ సాన్ పల్లి,నాచారం, దుబ్బపేట గ్రామాలల్లో పీఏసీఎస్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి,ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలల్లో విక్రయించి మద్దతు ధర రైతులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం క్వింటాల్ వరి ధాన్యానికి రూ.2,320 ఇస్తుందని, అదేవిధంగా, సాధారణ రకానికి రూ.2,300 ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, క్వింటా సన్న ధాన్యానికి అదనంగా మరో రూ.500 బోనస్ కూడా ఇస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఆన్ సాన్ పల్లి సర్పంచ్ గుగులోత్ జగన్ నాయక్,మాజీ ఎంపిపి దూలం సులోచన,స్పెషల్ ఆపిసర్ హరిత,పంచాయతీ కార్యదర్శి వెన్నెలకారొబార్ శ్రీకాంత్, రైతులు పాల్గొన్నారు.
Spread the love