డిసెంబర్ మాసంలోనే కొత్త రేషన్ కార్డులు,పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేయనుందని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో 10 లక్షల రూపాయలు నిధులతో సిసి రోడ్డు పనులను, 11 కోట్ల 30 లక్షల రూపాయలతో యావపూర్ నుండి తూముకుంట వరకు బీటీ రోడ్డు, పనులను పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకి 25 రోజులలోనే 18 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంనిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనత అని ఆయన అన్నారు. డిసెంబర్ మాసంలోనే ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తున్నామని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని బొమ్మలరామారం అంటేనే తనకు సెంటిమెంట్ తో కూడిన బంధం ఉందని ఆయన అన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి ప్రజలను మోసం చేసిన బిఆర్ఎస్ నాయకులు మళ్లీ ఇప్పుడు దీక్షా దివాస్ అనే పేరుతో ప్రజలను మోసం చేయడానికి ప్రజల్లోకి వస్తున్నారని కేటీఆర్ చేస్తున్న దీక్షా దీక్షా దివాస్ కాదని దివాలా కోర్ దివాస్ అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఆయన కార్యకర్తలకు భరోసాని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సింగిర్తి మల్లేశం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, రాజేష్ పైలట్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేశెట్టి చంద్రశేఖర్, శ్రీరాముల నాయక్, మాజీ జెడ్పిటిసి రాజేశ్వర్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు సునీత, రాజు నాయక్, గట్టయ్య, శ్రీనివాస్ నాయక్, మాజీ ఎంపిటిసి శ్రీహరి నాయక్, హేమంత్ రెడ్డి,జంగారెడ్డి,చీరసత్యనారాయణ, శంకర్ నాయక్, వెంకటేష్ గౌడ్,తునికి మహేష్, నాశమైన వెంకటేశం, కనకరాజు, స్వామి నాయక్, రెడ్డి నాయక్, అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.