
భవిష్యత్తు తరాల కోసం నీటిని సౌరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని శంభుని చెరువు ఆవరణంలో నిర్వహించిన సరోవర్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాల కోసం నేటిని సంరక్షించాలి అనే ఉద్దేశంతో ప్రధాని మోడీ అమలు చేస్తున్న అమృత సరోవర్ పథకంపై అవగాహన కల్పించారు. నీటిని పొదుపు చేసుకుంటే వ్యవసాయ సాగుకు ఉపయోగపడుతుందని చెరువులను కుంటలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగ అమలు దినోత్సవం ను పురస్కరించుకొని మహిళా సంఘం సభ్యులు, ప్రజల తో రాజ్యాంగ పీటీక ను ప్రతిజ్ఞ చేయించారు. ఇందిరా మహిళా శక్తి – ఉపాధి హామీ భరోసా పథకంలో జరిగే పనుల గురించి వివరించారు.ఉపాధి హామీ లో 100 రోజులు పని చేసిన వారిని, జీపీ మల్టిపార్పస్ వర్కర్స్ సన్మానం చేశారు., అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు ధాన్యం కొనుగోలు కేంద్ర పనితీరు ఏర్పాట్లు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని తెలిపారు. ట్యాబ్ ఎంట్రీ ఆలస్యం జరగకుండా వేగంగా చేయాలని ఆదేశించారు. మిల్లింగ్ ఎంట్రిలు కూడా సకాలంలో చేయాలని సూచించారు, రైతులకు డబ్బులు వేగంగా చెల్లించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లు యజమానులు, సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవహరించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూడాలని సూచించారు. కొనుగోలు జరిగిన వెంటనే మిల్లులకు రవాణా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి పి ఎస్ సి ఎస్ చైర్ పర్సన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి తాసిల్దార్ పి శ్రీనివాస్ ఎంపీడీవో సునీత ఏవో మురళీధర్ ఏపిఎం రమణఖర్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.