– మాలల సింహ గర్జన వాల్ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ – తాడ్వాయి
మాలల సింహ గర్జన సభను విజయవంతం చేయాలని మాల మహానాడు జిల్లా కన్వీనర్ గంగెల్లి విజయ్ అన్నారు. డిసెంబర్ 1 హైదరాబాదులోని పేరేడ్ గ్రౌండ్లో నిర్వహించే మాలల సింహ గర్జన సభ పోస్టర్లను బుధవారం మాల సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు తాము వ్యతిరేకులం అన్నారు. హైదరాబాదులో నిర్వహించే ఈ సభకు మాలలు అధికంగా తరలివెల్లి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా జేఏసీ నాయకులు బందెల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపిటిసి దానకర్ నరసింహారావు, మరి లక్ష్మయ్య, చిట్టి పెళ్లి బిక్షపతి, బందెల సమ్మయ్య, కనుమల్ల శ్రీను, బాబు, మరి నరసయ్య, కాటా నరసింహారావు, చిన్న బాబు, సతీష్ సంతోష్, సంజయ్, వంశీ, మాల కుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.