మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంచిర్యాల జిల్లా డీఆర్డీఏ పీడీ కిషన్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఆర్ ఎస్ ఈ టి ఐ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పథంలోపయనించాలన్నారు. ఈ జ్యూట్ బ్యాగుల తయారీలో దాదాపు 35 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ తీసుకొని స్వయం ఉపాధి పెంపొందించుకొనుటకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి, ఎంపీడీవో శశికళ అదేవిధంగా ఆర్ ఎస్ ఈ టి ఐ సంస్థ డైరెక్టర్ మహమ్మద్ గౌస్ . జాబ్స్ జేడియం రామ్ చందర్, ఏపీఎం బుచ్చన్న మండల సమైక్య అధ్యక్షురాలు సప్న ట్రైనర్స్ ఆశన్న రమేష్ సతీష్ పాల్గొన్నారు.