వేల్పుర్ మండలంలోని అక్లూర్ గ్రామంలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శుక్రవారం పరామర్శించారు. గ్రామానికి చెందిన గంగాధర్ కు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న సునీల్ కుమార్ బాధితుని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇదే గ్రామానికి చెందిన సాంబయ్యకు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆయనను కూడా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను ఇరువురు బాధితులను అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.