ఆశాలకు పెండింగ్ డబ్బులు వెంటనే చెల్లించాలి

Pending amounts should be paid immediatelyనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఆశాలకు లెప్రసి, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలని ఆశవర్కర్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. ఈ విషయమై శనివారం డీఏంహెచ్ఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. డిసెంబర్ 2 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లెప్రసి సర్వే చేయాలని ఆశాలకు జిల్లా అధికారులు చెప్తున్నారని కిరణ్ అన్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని లెప్రసి, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలని కోరారు.. రాష్ట్రంలో 2023లో సగం జిల్లాలకు, 2024లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఆశాలు చేసిన లెప్రసి డబ్బులు, 2024లో చేసిన పల్స్పోలియో డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ఆశాలకు చెల్లించలేదన్నారు. రెండు సంవత్సరాల నుండి చేసిన లెప్రసి సర్వే 2024లో చేసిన పల్స్ పోలియో డబ్బులు రాక ఆశాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. సంవత్సరాల తరబడి చేసిన పనికి డబ్బులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూన్నారని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా లెప్రసి సర్వే చేయాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు న్యాయమని అన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించి ఆశాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సుజాత, సంగీత, పుష్ప, లక్ష్మీ ఉన్నారు.
Spread the love