నవతెలంగాణ – బంజారా హిల్స్
తెలంగాణ తెచ్చింది కేవలం విద్యార్థి, ఉద్యోగులు మాత్రమేనని రాష్ట్ర ఫలాలు కేవలం విద్యార్థి ఉద్యమ నాయకులకు చెందాలని 10 ఏండ్ల పాలనలో ఉద్యమకారుల గుర్తించని బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ కారుల గురించి మాట్లాడే అర్హత లేదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి, ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జల కాంతంలు అభిప్రాయాలను వెల్లడించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల యాదిలో డా”పిడమర్తి రవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో గజ్జలకాంతంతో కలిసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కేవలం కల్వకుంట్ల కుటుంబం తెచ్చింది అని, రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకోవడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కల్వకుంట్ల కుటుంబం పాత్ర చాలా చిన్నదని, దాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోన్నారు. కాబట్టే ఓటమి చవిచూశారనీ అన్నారు. ప్రజా పాలనలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో ప్పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వేలాదిమంది విద్యార్థులు తమ ప్రాణాలను పనంగా పెట్టి రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేశారని, వాళ్ళందర్నీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఆనాటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రం ఏర్పాటు జరిగిందనీ, అంబేద్కర్ వాదం గెలిచిందని, చిన్న రాష్ట్రాల ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ఈ వేదిక నుండి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. 1200 మంది బలిదానాలు అంటూ ప్రగల్బాలు పలుకుతూ సమావేశాల్లో చెప్పిన కేసీఆర్ 700 మంది అంటూ సంఖ్య తగ్గించడం దేనికి సంకేతము, ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జై గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వట్టికూర రామారావు గౌడ్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పు బిక్షపతి,తెలుగు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుడిపల్లి రవి, ఓయూ జెఏసి నాయకులు రహీం, బద్రి, దర్శనం జాన్, బొమ్మెర స్టాలిన్, కంచర్ల బద్రి,బిఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్, మాడుగుల శివ,దేవరకొండ నరేష్ జోగు గణేష్ నక్క మహేష్ బైరపోగు సాంబశివుడు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు పాల్గొన్నారు.