- Advertisement -
హైదరాబాద్ : తెలంగాణలో ఖర్జూర సాగును విజయవంతంగా చేపట్టి.. సేంద్రీయ వ్యవసాయం ద్వారా రైతులకు ఆదాయం, ఆరోగ్యం, ఆనందాన్ని అందించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిందని ఆ సంస్థ అధినేత డాక్టర్ రమేష్ తెలిపారు. ఈ సందర్బంగా రమేష్‌ను మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. ఈ సాధన రాష్ట్రానికి గర్వకారణమని, రైతులు స్థిరమైన వ్యవసాయం ద్వారా లాభాలు, ఆరోగ్యం పొందాలని మంత్రి సూచించారు. సంపంగి గ్రూప్ సేంద్రీయ వ్యవసాయంలో ఆదర్శంగా నిలిచిందన్నారు. గిన్నీస్ రికార్డు సాధించిన డాక్టర్ రమేష్‌కు అభినందనలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
- Advertisement -