నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గత ఐదు రోజులుగా నిరసనలు చేస్తున్న ఉద్యోగుల శిబిరాన్ని ఆయన సందర్శించి, వారి సమస్యలు విని మాట్లాడారు. జిల్లా మండల స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల స్థాయిలలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు ఆరోగ్య బీమా 10 లక్షలు ఇవ్వాలని ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్న సందర్భంలో బెనిఫిట్స్ క్రింద 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శిబిరం దగ్గర ఉద్యోగస్తుల ముందే సిపిఐ శాసనసభ పక్ష నాయకులు కూనంనేని సాంబశివరావుతో ఫోన్లో మాట్లాడి ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం గురించి తెలియజేసి వారిని కలుసుకునేందుకు ఈనెల 14 వ తేదీన సమయం ఇప్పించారు వారిని కలిసి అన్ని విషయాలు చర్చించిన తర్వాత అసెంబ్లీలో ప్రస్తావించేటందుకు కృషి చేస్తామని ఉద్యోగుల సమస్యలు న్యాయమైనవని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ , జిల్లా సమితి సభ్యులు చిగురుల లింగం, ఉద్యోగస్తులు రచ్చ భారతి ముదిగొండ జమ్ములు స్వామి లు పాల్గొన్నారు.