- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
రిజర్వ్ బ్యాంకు వ్యవస్థాపకుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ఉద్రించాలని రథయాత్ర చేపట్టిన జేరిపోతుల పరుశురాం శనివారం హుస్నాబాద్ లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి, కార్యక్రమాన్ని వివరించారు. కరెన్సీ మీద అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని తెలుపుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోస్ట్ కార్డు రాశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి తదితరులు ఉన్నారు.
- Advertisement -