నవతెలంగాణ – జన్నారం : జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన దాసరి చంద్రమోహన్(53) అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. మృతుని బంధువులు తెలిపిన ప్రకారం చంద్రమోహన్ గత కొన్ని సంవత్సరాల నుండి కరీంనగర్ లో సివిల్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు అని తెలిపారు. వృద్ధులైన చంద్రమోహన్ తల్లిదండ్రులు రాంపూర్ గ్రామంలో ఉండటంతో ఆయన సతీమణి గత మూడు రోజుల క్రితం రాంపూర్ కు వచ్చి వారి బాగోగులు చూసుకుంటున్నారు.
కరీంనగర్లో ఒంటరిగా ఉన్న చంద్రమోహన్ కు బుధవారం రాత్రి చాతిలో నొప్పి రావడంతో తన స్నేహితుడికి ఫోన్ చేసి తెలిపాడని వెంటనే వచ్చిన స్నేహితుడు హాస్పిటల్ కు తీసుకువెళ్లి చికిత్స చేయించారని తెలిపారు. బుధవారం రాత్రి కరీంనగర్ లోని ఇంటికి వచ్చిన చంద్రమోహన్ కు గురువారం తెల్లవారుజామున మళ్లీ గుండెపోటు రావడంతో స్నేహితుడు వెళ్లేసరికి మృతి చెందాడు. చంద్రమోహన్ కు భార్య రజిత పాటు ఇరువురు కూతుళ్లు తేజస్విని, అంజలి వృద్ధులైన కౌసల్య, నరసయ్య అనే తల్లిదండ్రులున్నారు. గురువారం సాయంత్రం స్వగ్రామైన రాంపూర్ లో చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించారు.



