రికార్డ్‌ స్థాయికి వాణిజ్య లోటు

రికార్డ్‌ స్థాయికి వాణిజ్య లోటు– పెరిగిన దిగుమతులు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది నవంబర్‌లో భారత ఎగుమతులు తగ్గడం, దిగుమతులు భారీగా పెరగడంతో వాణిజ్య లోటు రికార్డ్‌ స్థాయికి ఎగిసింది. క్రితం నెలలో వాణిజ్య లోటు ఏకంగా 37.84 బిలియన్‌ డాలర్లకు చేరిందని సోమవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణంకాలు వెల్లడించింది. ఇంతక్రితం అక్టోబర్‌లో ఇది 27.1 బిలియన్లుగా నమోదయ్యింది. గతేడాది నవంబర్‌లో 33.75 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఎగుమతులు ఈ ఏడాది 32.11 బిలియన్‌ డాలర్లకు క్షీణించాయి. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఈసారి దిగుమతులు 27శాతం పెరిగి 69.95 బిలియన్‌ డాలర్లకు ఎగిశాయి. 2023 నవంబర్‌లో 55.06 బిలియన్ల దిగుమతులు జరిగాయి. గడిచిన నెలలో బంగారం దిగుమతులు రికార్డ్‌ స్థాయిలో 14.8 బిలియన్లుగా నమోదయ్యాయి.

Spread the love