గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితులు అరెస్ట్

నవతెలంగాణ –  కామారెడ్డి 
 గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఐదుగురు నిందితులను పట్టుకుని అరెస్టు చేసినట్లు కామారెడ్డి రూరల్ సిఐ రామన్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో నిజామాబాద్ నుండి కామారెడ్డికి నిషేధిత గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారని సమాచారం రాగా  సీఐ కామారెడ్డి రూరల్, దేవునిపల్లి  ఎస్ఐ  తమ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి నేషనల్ హైవే 44 బైపాస్ రామారెడ్డి బ్రిడ్జి వద్దకు వెళ్లి అక్కడ తనిఖీ నిర్వహించి,   అక్కడ ఒక కారు, మోటారు సైకిల్ పై గంజాయి తరలిస్తున్న అయిదుగు వ్యక్తులను పట్టుకుని వారిని పోలీసు వారు విచారించగా వారు అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి 445 గ్రాముల గంజాయి, నాలుగు మొబైల్ ఫోన్స్, ఒక స్కూటీ ,ఒక కారు స్వాధీనపర్చుకొని వారిని రిమాండ్ కు తరలించమన్నారు.
         నిందితులలో నిజామాబాద్ కు చెందిన రాథోడ్ రవి, కామారెడ్డికి చెందిన దేవుని పృథ్వి, నిజాంబాద్ కు చెందిన సయ్యద్ సాజిద్, కామారెడ్డికి చెందిన నెట్టూరు సిద్ధార్థ రావు, కామారెడ్డికి చెందిన పసుపులోటి భానుచందర్ లు ఉన్నారన్నారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొని కేసుని చేదించిన కామారెడ్డి రూరల్ సీ.ఐ. ఏస్.రామన్, దేవునిపల్లి ఎస్సై జి.రాజు , క్రైమ్ టీం సిబ్బంది రవికిరణ్, రామస్వామి,పిసి బాలకృష్ణ, హోంగార్డ్ రాజులను జిల్లా ఎస్పీ  కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీసు అధికారి చైతన్య రెడ్డి లు  అభినందించరాన్నారు.
Spread the love