
నవతెలంగాణ – మాక్లూర్
రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని ఫిబ్రవరి 20న చలో హైదరాబాదును విజయవంతం చేయాలని సిపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మాకులూరు మండల ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి డిమాండ్ చేశారు. బుదవారం మండలంలోని బోర్గం (కే ) గ్రామంలో చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని ఫిబ్రవరి 20,న వేలాది మందితో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎస్విటి నుండి భారీ ప్రదర్శన ఇందిరాపార్కులో బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. ప్రభుత్వ ఇచ్చిన హామీల పరిష్కారం అయ్యేంతవరకు ప్రజలు పోరాడాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సిర్రం శంకర్, ఇ. శ్రీనివాస్ రెడ్డి, దేశెట్టి రాధా, సరోజన, లత , భాగ్య , తదితరులు పాల్గొన్నారు.