తలిదండ్రులంటె నిను కన్నవారు కానెకారు
నిత్య నిరంతరం నీ బాగుకోరు శ్రమైక జీవనులు
తలిదండ్రులంటే నిను కన్నవారు కానెకారు
భవిష్యవర్తమానులందు నీ మేలుకోరు భావుకులు
తలిదండ్రులంటే నిను కన్నవారు కానెకారు
భూతమందు కూర్చలేని కార్యమందు బాధకులు
తలిదండ్రులంటే నిను కన్నవారు కానెకారు
నీదు ప్రగతిగతిజూడ ఆశజెందు అర్భకులు
తలిదండ్రులంటే నిను కన్నవారు కానెకారు
తల్లిగొప్ప తండ్రిగొప్ప ఏది గొప్పనెరుగరు
సగమై చెరిసగమై తనయుల వద్ధిచూడ తపనకులు
వివేకమెంతో నేర్పగోరు విలువలేని విశిష్టులు
తలిదండ్రులంటే నిను కన్నవారు కానెకారు
రేయిబవలు తిండిమాని శ్రమించే శ్రామికులు
బెండ్లినీకు జేసి ఇంటి నిలువ జేయకోరు
అహమురాత్రి సుఖమువదిలి నర్తించే నర్తకులు
తలిదండ్రులంటె నిను కన్నవారు కానెకారు
నీదు భార్య పిల్లలందు (ప్రేమకోరు ప్రేమికులు
జీవిత చరమాంకంలో నీ ప్రాపున పోవాలని
నిరీక్షించే నిరర్థకులు
తలిదండ్రులంటె నిను కన్చవారు కానెకారు
తగదు చూడ తక్కువ బుద్ధితెలిసి చూపు మక్కువ
– లక్ష్మీశేఖర్ నీలగిరి, 9542490634