మైల బంధం

mile bondనేను ఇక్కడే ఉంటా
ఎక్కడ ఉన్నా ఇక్కడే ఉంటా
ఈ ఆరు బయటనే
హదయాన్ని గాలిపటంలా ఎగరేసుకుంట

రెక్కలు ఇప్పుకోలేని ఇంట్లో
మూలకు పడి ఉండలేక
పిట్టో చెట్టో పిలిస్తే
తోవలు తీసుకున్న
నిశ్శబ్దంగా మాట్లాడుకుంటూ
గోడలు లేని జాడ కొచ్చిన
పూర్వ నీడల మైల బంధం
పూనకమై….
ప్రకతికి పాలోన్ని చేసింది

ఇక్కడ అంతా అంతే
ఎటు చూసినా
ఎద ఏరవుతుంది
అదశ్యదారులెంట నడుస్తున్నప్పుడు
లోన దుఃఖం నాటుకొని
మేఘమై పూసే
పొగ చెట్లను చూశా
ఎన్ని కళ్ళను తుడిచిందో
తడి తడిగా ఎగిరిపోతుంది గాలి

ఒక మెరుపు మెరిసిపోయింది
వాయిద్యం లా
ఉరుము ఉరిమిపోయింది
వానకు తడిసిన రేల చెట్టు
అనుభూతిని….
గాలితో పంచుకుంది
నేల మీద పూల వాగు
వెన్నెల్లో మునిగితేలుతున్న

చెట్లు నేలకు ఆకాశానికి ధన్యవాదాలు చెబుతూ
పారవశ్యపు వేడుకలో ఉన్నాయి
తెలవని రంగులెన్నో
నన్ను ముంచెత్తుతున్నాయి
వాన వీణరాగమై కురుస్తుంది
పూలు రేపు తుమ్మెదలకు
ఒక పాటను కూర్చుకున్నాయి
అన్ని నత్యం లోనే ఉన్నాయి
పొద్దు కూడా దినమాలస్యమైనా
మెల్లగానే కదులుతుంది

పిట్టలు వాలి
చెట్టుకు గొంతునిచ్చాయి
శ్వాసను మీటుతుంటే
లోన శూన్యరాగం
ఇది దివ్య తలం
ఇక్కడే నా ఆత్మని ఇనాముగా ఇచ్చి
దేహాన్ని పారేసుకుంట.
– మునాసు వెంకట్‌ , 9948158163

Spread the love