కిడ్నీ సమస్య ఉంటే….

If you have kidney problems...మన జీవనశైలిని మార్చుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలను నియంత్రించవచ్చు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో చూద్దాం.
పొటాషియం ఒక ముఖ్యమైన ఖనిజం, ఇది నరాల, కండరాల కణాలు సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది. అయితే పొటాషియం అధికంగా తీసుకోవటం మూత్రపిండాల వ్యాధి ఉన్నవారికి హానికరం. వీరికి అరటిపండ్లు, నారింజ , బంగాళదుంపలు వంటి వాటి వినియోగాన్ని తగ్గించాలి.
ఉప్పు ద్వారా మనకు ఎక్కువ సోడియం అందుతుంది. కిడ్నీ రోగులు రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. ఎందుకంటే ఇది కిడ్నీలను దెబ్బతీస్తుంది. చిప్స్‌, ఫాస్ట్‌ ఫుడ్స్‌, అన్ని రకాల ఉప్పు పదార్థాలకు దూరంగా ఉండాలి.
మాంసం , ప్రాసెస్‌ చేసిన మాంసాలలో అధిక మొత్తంలో ప్రోటీన్‌ ఉంటుంది. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది.
అలాగే కిడ్నీ రోగులు టీ, కాఫీలకు దూరంగా ఉండటమే మంచిది.

Spread the love