నవతెలంగాణ -పెద్దవూర
నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, పెద్దవూర మండలం పులిచర్ల పంచాయతీ పరిధిలోని కలసానివారి గూడెం గ్రామస్తుల ఆహ్వానం మేరకు శుక్రవారం నూతనంగా నిర్మించబోతున్న రామాలయ నిర్మాణం గురించి అడిగి తెలుసుకుని గ్రామస్తుల కోరిక మేరకు సొంత ఖర్చులతో ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తామని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి హమీ ఇచ్చారు.ఈసందర్బంగా మాట్లాడుతూ కలసాని వారి గూడెం అంటేనే ఆ గ్రామం గొప్పతనం గురించి చెప్పాలంటే మాటలు చాలవన్నారు.గ్రామస్తులు నమ్మితే ఎందాకైనా తోడుంటారని తరతరాలుగా వారి చరిత్ర ఆధ్యాత్మికతలో భాగమైందని అన్నారు. ఎంతో వైవిధ్యమైన జీవనశైలిలో,ఎంతో భక్తి,శ్రద్ధలతో ఆధ్యాత్మిక వైపు అడుగులు వేస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,కలసాని తిరుమల యాదవ్, రాయినబోయిన పరమేష్,కలసాని ఆంజనేయులు యాదవ్,గుడారి వెంకటేశ్వర్లు,రాయినబోయిన లింగయ్య,కలసాని కొండలు,కలసాని సతీష్ యాదవ్,కలసాని సైదులు యాదవ్,కలసాని శ్రీను,కలసాని మట్టయ్య,కలసాని గోపాల్,కలసాని ముత్యాలు,కలసాని చిన్న నరసింహ,కొట్టే వీరయ్య,రాయినబోయిన వెంకన్న ,రాయినబోయిన సైదులు,రాయినబోయిన పెద్ద లింగయ్య, రాయినబోయిన వెంకటయ్య,కలసాని మల్లయ్య, రాయినబోయిన నరసింహ,గజ్జల నాగార్జున రెడ్డి, వంగాల భాస్కర్ రెడ్డి,గజ్జల శివారెడ్డి, అనుముల కోటేష్ మరియు కలసానివారి గూడెం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.