
నవతెలంగాణ వేములవాడ
వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం హోలీ పండుగ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నారు.హోలీ పండుగ అంటేనే చిన్నారులకు ఎంతో ఆనందంతో ఆటపాటలతో రంగులు పూచుకుంటూ ఆనందపడతారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద తేడా లేకుండా పట్టణాల్లో, గ్రామాలలో రంగులతొ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు మోదుగ పువ్వు తో తయారుచేసిన రంగులను ఒకరికి ఒకరు చల్లుకుంటూ ఆనందంగా హోలీ జరుపుకున్నారు. స్పీకర్ బాక్స్ దగ్గర నృత్యాలు చేసుకుంటూ హోలీ పండుగను అందరూ ఆనందంగా సరదాగా గడిపారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నేతలతో కలిసి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కనికరపు రాకేష్, కూరగాయల కొమరయ్య, అరుణ్ తేజ చారి, మర్రిపల్లి రాజు, ముంజ ఉమేందర్, పులి రాంబాబు, నాగుల రాము తో పాటు తదితరులు పాల్గొన్నారు.