నవతెలంగాణ -పెద్దవూర
నల్లగొండ జిల్లా,నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం అల్వాలపాడు గ్రామంలో బుధవారం గంగమ్మ తల్లి మొదటి వార్షికోత్సవానికి గ్రామ కమిటీ ఆహ్వానం మేరకు ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి గ్రామ బొడ్డురాయి వద్ద నుంచి గంగమ్మ తల్లి దేవాలయం వరకు పాదయాత్ర చేశారు.ఆలయ కమిటీ సభ్యులు పూలతో ఘనంగా స్వాగతం పలికారు.తదనంతరం శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ సందర్బంగా స్వహస్తాలతో అక్కడికి వచ్చిన భక్తులకు వడ్డించి మహా అన్నదాన కార్యక్రమం చేపట్టట్టారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి,అల్వాలపాడు మాజీ సర్పంచ్ చెవుల రాములు,గంగమ్మ తల్లి దేవాలయ ఛైర్మన్ బొలిగొర్ల సైదులు,గ్రామ పార్టీ అధ్యక్షుడు రాంబాబు, వెంకన్న, లక్ష్మయ్య, రావుల పుల్లయ్య, చంద్రయ్య, భిక్షం రాంబాబు, లింగయ్య,సందీప్,వలరాజు, రవి, శ్రీను, మట్టయ్య, అశోక్, రమేష్ చారి,భాస్కర్ రెడ్డి, నితిన్,నాగార్జున రెడ్డి, శివారెడ్డి,అబ్దుల్ కరీం, యాదవ్ సంఘం అధ్యక్షుడు వెంకన్న యాదవ్, సైదయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.