నవతెలంగాణ కథనానికి స్పందన

– ఈనెల 18న విలాసాగర్ గ్రామానికి కీడు సోకిందని గ్రామాన్ని వదిలి వంటలకు కథనాన్ని నవతెలంగాణ ప్రచురించింది.
– మనిషిని మనిషి లాగా ఉండనివ్వదు,
– మనిషిని మూర్ఖం గా మారుస్తుంది మూఢ నమ్మకం
– మూఢనమ్మకాలపై ప్రజలుచైతన్యవంతులు కావాలి 
– డిప్యూటీ డిఎంహెచ్ఓ  డాక్టర్ చందు
నవతెలంగాణ – జమ్మికుంట
మనిషిని మనిషిలాగ ఉండనివ్వదు, మనిషిని మూర్ఖంగా మారుస్తుంది మూఢనమ్మకము. అందుకే మూఢనమ్మకాలపై ప్రజలు చైతన్యవంతులు కావాలని హుజురాబాద్ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు అన్నారు. శుక్రవారం జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో గత నెల రోజుల నుండి జరుగుతున్న సంఘటనలు (యాదృచ్ఛికంగా జరుగుతున్న మరణాలు) గ్రామంలో చేతబడి బాణామతి జరుగుతుందని గ్రామానికి కీడు సోకిందని గ్రామ ప్రజలందరూ ఊరు విడిచి గ్రామ పొలిమేర లో ఉదయం నుండి రాత్రి వరకు ఉండడం గ్రామంలో జరుగుతున్న సంఘటనల మీద జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  ఆదేశానుసారం డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు  సారధ్యంలో విలాసాగర్ గ్రామంలో గడపగడపకు చేతబడి బాణామతి వంటి మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తూ, గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు మాట్లాడుతూ.. చేతబడి బాణామతి వంటి మూఢనమ్మకాలను ప్రజలు ఎవరు నమ్మవద్దని అటువంటి వాటికి దూరంగా ఉండాలని అన్నారు. ప్రజలు ఎవరైనా అనారోగ్యం బారిన పడితే మూఢనమ్మకాల జోలికి పోకుండా, అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైద్య సిబ్బందిని సంప్రదించాలని కోరారు. మూఢనమ్మకం మనిషిని మూర్ఖంగా చేస్తుందని, మనిషిని మనిషిలాగ ఉండనివ్వదని అందుకే ప్రజలందరూ మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ప్రజలను చైతన్య పరచడం జరిగిందని తెలిపారు.
 అలాగే వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వైద్య శిబిరం ఏర్పాటుచేసి ఆరోగ్య సమస్యలు ఉన్న ప్రజలకు వైద్య పరీక్షలు చేసి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మందులు పంపిణీ చేశారు.హెల్త్ ఎడ్యుకేటర్స్ పంజాల ప్రతాప్ గౌడ్,  మోహన్ రెడ్డి  మాట్లాడుతూ ..వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేసవి ఎండల తీవ్రతలకు ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ప్రజలు వడ దెబ్బకు గురయ్యే అవకాశం ఉందన్నారు.  కాబ్బటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.  వడ దెబ్బ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను క్లుప్తంగా వివరించామన్నారు. వడ దెబ్బ నివారణకై ప్రజలు , కూలీలు అందరూ రోజుకి 10 గ్లాసుల కన్నా ఎక్కువ నీరు త్రాగాలన్నారు. బయటికి వెళ్లి నప్పుడు గొడుగు, టోపీ, తలపాగ, తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. ఉదయం , సాయంత్రం ఎండ లేని సమయంలో పనులు చేసుకోవాలని  సూచించారు.
ఈ కార్యక్రమములో ఎంపీడీఓ బీమేష్ , జమ్మికుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ వరగంటి రవి , డాక్టర్ సన్నిల్లా రాజేష్, డాక్టర్ హీమబిందు, డాక్టర్ కార్తీక్,  సూపర్ వైజర్స్ రత్న కుమారి, సదానందం, పంచాయితీ కార్యదర్శి విష్ణు, ఏ ఎన్ ఎం ఎస్ సౌందర్య, హైమావతి, మనోవికాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంటాల బుచ్చయ్య, ఆశా కార్యకర్తలు మంజుల, రాజమ్మ, రాజేశ్వరి, సువర్ణ,  తదితరులు పాల్గొన్నారు.
Spread the love