చిరుధాన్యాలు, పోషకాహారంతోనే ఆరోగ్యకర జీవితం: సీపీపీఓ ఎల్లయ్య 

నవతెలంగాణ – దుబ్బాక 
ప్రస్తుత జీవన విధానంలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి పోషక విలువలతో కూడిన ఆహారం,చిరుధాన్యాలు తీసుకోవాలని ఐసీడీఎస్ సీడీపీఓ ఎల్లయ్య కోరారు. బాలికల్లో రక్తహీనత నివారణకు ఆకుకూరలు, ఐరన్ మాత్రలు తీసుకోవాలన్నారు.”పోషణ పక్షం- 2025″ అన్న కార్యక్రమంలో భాగంగా గురువారం దుబ్బాక మండలం హబ్సిపూర్ లోని అంగన్వాడీ కేంద్రం – 2 లో నిర్వహించిన కార్యక్రమానికి సీడీపీఓ ఎల్లయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.దుబ్బాక ప్రాజెక్టు పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ నెల 8 నుంచి 22 వరకు పోషణ పక్షం కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణీలు,బాలింతలకు అందిస్తున్న ఒక పూట సంపూర్ణ భోజనం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం “సరైన పోషణ- ఆరోగ్య తెలంగాణ- పోషణ లోపంఏ ఊర్లో కనిపించకూడదు” అన్న నినాదాలతో అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, గర్భిణీలు, బాలింతలతో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశాల మేరకు అన్ని అంగన్వాడీ కేంద్రాలకు తడి,పొడి చెత్తబుట్టలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో పోషన్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ శ్యాంసన్,పంచాయతీ కార్యదర్శి వజ్ర,ప్రైమరీ స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్,ఉపాధ్యాయులు బాలరాజు, జ్యోతి, సెక్టార్ సూపర్వైజర్ రాజేశ్వరి, అంగన్వాడీ టీచర్లు, మంజుల, బాల్ లక్ష్మి, ఆశాలు లక్ష్మీ, సుభద్ర, గర్భిణీలు బాలింతలు పలువు పాల్గొన్నారు.
Spread the love