గెలలు ఫుల్.. బారులు తీరిన వాహనాలు

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎండలు మండుతున్నా గత రెండు రోజులుగా అడపాదడపా పడుతున్న వర్షాల ప్రభావమో లేక గెలలు దిగుబడి లో వచ్చిన ఫల ప్రభావమో కానీ గత రెండు రోజులుగా ఆయిల్ ఫాం గెలలు దిగుబడి పెరిగింది.రెండు పరిశ్రమల్లో అప్పారావు పేట పరిశ్రమ వార్షిక నిర్వహణ కోసం నిలిపివేయడంతో అశ్వారావుపేట పరిశ్రమలో మాత్రమే గెలలు క్రస్సింగ్ చేస్తున్నారు.ఈ పరిశ్రమల సామర్ధ్యం మించి గెలలు దిగుబడి రావడంతో పరిశ్రమలో దిగుమతి జాప్యం జరుగుతుంది.ఇప్పటికే ప్లాంట్ ఫాం నిండి పోవడంతో గెలలు వాహనాలు పరిశ్రమ ప్రాంగణంలో బారులు తీరాయి.ఇలాంటి పరిస్థితి గత మూడేళ్ళ క్రితం మాత్రమే ఉంది.తిరిగి ఆ పరిస్థితి గురు,శుక్రవారాల్లో కనిపిస్తుంది.అంతేగాక గెలలు సేకరణ కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోయి నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆయిల్ ఫెడ్ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో 36039 మంది రైతులు,1,44,335.68 ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు చేస్తున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది గెలలు దిగుబడి మెరుగు పడే అవకాశం ఉందని పలువురు రైతులు తెలిపారు.2024 ఏప్రియల్ వరకు 24837 టన్నుల గెలలు రాగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో (10 రోజులు)గురువారం నాటికే 15910 టన్నుల గెలలు పరిశ్రమకు చేరాయి.దీంతో గతేడాది కంటే ఈ ఏడాది గెలలు దిగుబడి పెరిగే అవకాశం కనిపిస్తుంది.
గెలలు టన్ను ల్లో…   
నెల                       సంవత్సరం             గెలలు
                             2024                     2025
జనవరి                 6197                      7394
ఫిబ్రవరి                 3400                      4740
మార్చి                  5300                      9286
ఏప్రిల్                  9000                       4010
మొత్తం              23797                     15910
Spread the love