ప్రపంచ అందాల పోటీలను రద్దు చేయాలి…

నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం)
ప్రపంచ అందాల పోటీలను రద్దు చేయాలని తెలంగాణ ప్రజాప్రంట్ జిల్లా అధికార ప్రతినిది ఆకుల లలిత డిమాండ్ చేశారు.గురువారం కాటారం మండల కేంద్రంలో విలేకరులతో  మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వం హైద్రాబాద్ లో మే 7-31వరకు నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్ ), పోటీలను రద్దు చేయాలిలని తెలంగాణలో  చాకలి ఐలమ్మ, మల్లు, స్వరాజ్యం, ఆరుట్ల కమల, రంగవల్లి, స్వర్ణక్క, బెల్లి లలిత లాంటి వీరనారి మణులకు పుట్టినిలు. ఎంతో పోరాట చరిత గల్ల తెలంగాణలో ఈ అందాల పోటీలను మహిళ లోకం అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ సంస్థల నుండి పెట్టుబడులకోసం తెలంగాణ ప్రభ్యత్వం ఆడవాళ్ళ అందాలను ఎరగా వేయడం శోచనీయం అన్నారు.మహిళలు నిత్యం అత్యాచార హత్యలకు బలవుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి అందాల పోటీలు నిర్వహించడం తగదని, కనీస ఉపాధి కరువైన పేద మహిళలు కుటుంబాలను పోషించే బాధ్యత తీసుకుని రెస్టారెంట్లు , మద్యం బార్లులో రాత్రి పూట కూడా పని చెయ్యడానికి సిద్ధపడుతున్నారని, అలాంటి చోట్ల వారిపై అన్ని రకాలు వేదింపులు , అత్యాచార హత్యలు జరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. కూటికి లేని నిరుపేద మహిళల్లో కూడా అందం పట్ల శ్రద్ధను పెంచి వారీ చేత కాస్మోటిక్స్ , పౌడర్లు , మేకప్ సామాన్లు కొనిపించాలని  చూస్తున్నారని. పురుషుల శ్రమ మద్యం పాలతే , మహిళల శ్రమ సౌందర్య సరుకుల పాలు చేస్తారన్న మాట. ఇక మహిళల్లో అందగత్తెలు అనాకరులు అనే విభజన పెంచి మహిళలలో ఆత్మన్యూనత భావాన్ని పెంచే కుట్రలు చేస్తున్నారు. ఈ న్యూనత భవానికి లోనైన మహిళలు తమ కూలి డబ్బుల్ని వీళ్ల వ్యాపారాల్లో తగలేసే కుట్రలు పన్నుతున్నారు.అందమైన మహిళలకు కొన్ని ప్రమాణాలు నిర్ణయించి ఒకరిద్దరు సంపన్న వర్గాల మహిళల్ని.అందాల సుందరి పేరుతో ఎంచుకుని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తారు.
అలాంటి ప్రమాణాలకు తూగనీ 90 శాతం మహిళల్ని అంద వికారులుగా ముద్రవేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తారు.మీరు కూడా అందంగా ఉండాలంటే మా కాస్మోటిక్స్ వాడాలని పెద్ద ఎత్తున ప్రసారాలు చేస్తారు. వీళ్ల ప్రభావానికి లోనైన పురుషులు ఇవే ప్రమాణాలతో  మహిళల అందాలను కొలవడానికి సిద్ధపడతారు. పెళ్లి చూపుల్లో కూర్చున్న మహిళల్ని వాళ్ళ చూపులతోటే ఆమె అందాన్ని కొలిచి అన్యాయంగా తిరస్కరిస్తారు.ఆమె అందంగా లేదని ముద్రలేస్తారు. అలా అనేక మంది చేత తిరస్కరించబడి , పెళ్లికి అర్హత లేని మహిళగా ముద్రవేస్తుంది ఈ సమాజం. ప్రేమ, పెళ్లి, సంసారానికి కూడా అందమే ప్రధాన అర్హతగా నిర్ణయించి మహిళల్ని అనర్హులుగా ముద్ర వేస్తుంది ఈ సమాజం.ఈ ముద్రల నుండి బయట పడడానికి మహిళలు అనివార్యంగా కాస్మోటిక్స్  వాడడానికి పూనుకుంటారు. బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు దారపోస్తారు. అందం పెరగలేదనే న్యూనత భావంతో మానసికంగా కుంగిపోయి అనారోగ్యం పాలవుతారు. నాసి రకం క్రీములను వాడడం ద్వారా తీవ్రమైన చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. బరువు తగ్గి నాజూకుగా కనిపించడం కోసం ఏవేవో పౌడర్లు తాగుతూ అనారోగ్యాల పాలై చివరికి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు లెక్కలేనంత మంది ఉన్నారు.140 దేశాలకు చెందిన మహిళలు మిస్ వరల్డ్ అందాల పోటీలలో పాల్గొన్ దానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీల వల్ల మన తెలంగాణ సంస్కృతి విద్వంసం అయ్యే ప్రమాదం ఉన్నది. టూరిజం పేరు మీద ఇక్కడ విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరుపుతారు. వినోదాల పేరుతో హద్దు పద్దు లేకుండా పబ్బులు , క్లబ్బులు తెరిచి విష సంస్కృతిని పెంచుతూ యువతను పెడ దారి పట్టించే ప్రమాదం ఉన్నది.మహిళలను అంగడి సరుకుగామార్చే వ్యాపార, వాణిజ్య లకు తోడు, ప్రభుత్వం సైతం మహిళల అందాల పై వ్యాపార ధోరణి అవలంభించడంసిగ్గుచేటు అన్నారు.చాకలి ఐలమ్మ పేరు యూనివర్సిటీకి మహాలక్ష్మి లాంటి పథకం మహిళలకు ప్రవేశపెట్టిన ప్రభుత్వం అందాల పోటీలకు అథిత్యం ఇవ్వడం మహిళల ఆత్మగౌలరవన్నీ కించపరచడమే అని అన్నారు.ప్రపంచ అందాల పోటీలను రద్దుచేయాలనీ తెలంగాణ ప్రజా ఫ్రంట్ డిమాండ్ చేస్తుందని ఆకుల లలిత అన్నారు.
Spread the love