చందమామ

Chandamamaఎక్కడో ఆకాశం లో వుండే
చంద్రుడు
నాకు మామేట్లా అవుతాడు
మా అమ్మకు తోడబుట్టిన వాడా
నాకు పిల్లనిచ్చిన వాడా
బైరూపులోడు
రోజుకోతీరు కనిపిస్తాడు
చంద్రవంకలా ఒక రోజుంటే
చంద్రబింబమై మరొక రోజుంటాడు
ఒకరోజు పాపం
మామను అమావాస్య కమ్మేస్తే
మరో పూట పున్నమి వికసింప చేస్తుంది
మా మామా అల్లుండ్లది
రక్త సంబధమో ఆత్మ సంబంధమో
ఆకాశంలోంచి చందమామ
నా కంటి చూపును వెలిగిస్తాడు
దేహమంతా వ్యాపిస్తాడు
మనసంతా వెన్నెల పరిచేస్తాడు
– వారాల ఆనంద్‌

Spread the love