
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య డా. బి.ఆర్. అంబేద్కర్ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ డా. బి. ఆర్. అంబేద్కర్ సామాన్య నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికి తన అపార మేధాశక్తులతో సమాజంలోని రుగ్మతలను దూరం చేసేందుకు పాటుపడిన మహనీయుడని, దళితుల అభ్యున్నతికి నిరంతరం కృషిచేసి సమాజంలో ని అంటరానితనము, అసమానతలు రూపుమాపుటకు ఎంతో తొడ్పడిన ఘనత డా. బి.ఆర్. అంబేద్కరు దక్కుతుందని భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు మరువరానివని ప్రపంచ దేశాలలోనే కీర్తించబడే అతి పెద్ద భారత రాజ్యాంగాని రచించి ప్రజాస్వామ్య విలువలను పెంపొందించి, దళితులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి విస్తరంగా ప్రచారంచేసి వాటిని సద్వినియోగపరిచే విధంగా ప్రతిఒక్కరు కృషి చేయాలని, డా. బి.ఆర్. అంబేద్కర్ అందించిన ఫలాలలో నేడు అనగారిన వర్గాలు రిజర్వేషన్ సౌకర్యాలు పొందుతు సమాజంలోని ఇతర వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందెందుకు ఆస్కారం చేసేందుకు ఎంతో కృషిచేసిందని డా. బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగము ఆధారంగానే ప్రస్తుతం దేశంలోచట్టాలు సమర్ధవంతముగా అమలు అవుతున్నాయని, ప్రతిఒక్కరు డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని, అగ్ర వర్ణల దాడులకు గురైన బాదితులకు సత్వరన్యాయం అందించుటకు పోలీస్ శాఖ నిరంతరం చిత్త శుద్దితో కృషి చేస్తుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి ( స్పెషల్ బ్రాంచ్ ) శ్రీనివాస్ రావ్ , నిజామాబాదు ఎసిపి రాజా వెంకట్ రెడ్డి,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం , ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్ , బషీర్ , వనజ రాణి, రిజర్వు ఇన్స్ పెక్టర్స్ శేఖర్ బాబు ( ఎంటీఓ), శ్రీనివాస్ (అడ్మిన్), తిరుపతి (వెల్ఫేర్) , సతీష్ ( హోమ్ గార్డ్స్ ) ఐ.టి కోర్ సిబ్బంది , సి.సి.ఆర్.బి సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోమ్ గార్డ్సు సిబ్బంది పాల్గొన్నారు.