వచ్చే విద్యా సంవత్సరానికి యూనిఫార్మ్స్ సిద్ధం చేస్తాం: ఎంఈఓ ప్రభుదాస్ 

నవతెలంగాణ -దుబ్బాక
మండలంలోని ప్రభుత్వ ప్రైమరీ,హైస్కూల్,మోడల్ స్కూల్,కస్తూర్బా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం 6357 మీటర్ల మెటీరియల్ వచ్చిందని.. విద్యార్థులకు సరిపడా స్కూల్ యూనిఫార్మ్స్ ను ఐకేపీ ఆధ్వర్యంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులచే కుట్టించి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కల్లా సిద్ధం చేసేలా కృషి చేస్తున్నామని ఎంఈఓ జోగు ప్రభుదాస్ తెలిపారు. బుధవారం దుబ్బాకలోని ఎంపీపీఎస్ నెంబర్- 1 లో విద్యార్థులకు తీసుకుంటున్న కొలతల తీరును ఐకేపీ ఏపీఎం కృష్ణారెడ్డి తో కలిసి ఆయన పరిశీలించారు. వారి వెంట హెచ్ఎం సక్కుబాయి, టీచర్లు నర్సింహారెడ్డి స్వామయ్య, ఐకేపీ సీసీ పర్శరాములు పలువురున్నారు.
Spread the love