
కామారెడ్డి కలెక్టరేట్లో ఉద్యోగులు రాగానే వారు వచ్చినట్లుగా బయోమెట్రిక్ లో వేలిముద్ర వేయడం జరుగుతుంది. అందుకుగాను కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన రెండు బయోమెట్రిక్ మిషిన్లలో ఒకటి చెడిపోయి ఒకటే పని చేయడంతో బయోమెట్రిక్ పెట్టేందుకు ప్రతిరోజు కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే సుమారు 500 మంది వరకు ఉద్యోగులు బయోమెట్రిక్ లో వెళ్లి ముద్ర వేస్తారు. గురువారం ఉదయం ఒకే మెషిన్ పనిచేయడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అధికారులు స్పందించి అదనంగా మరో బయోమెట్రిక్ మిషిన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.