- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని భువనగిరి, ఆలేరు ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఈనెల 28వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్లు జరగనున్నట్లు భువనగిరి ఐటిఐ ప్రిన్సిపాల్ తెలిపారు. పదవ తరగతి పాసైన ఆసక్తికర అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఒక సెట్టు జిరాక్స్ తో ఐటిఐ కళాశాలకు తీసుకురావాలని , అడ్మిషన్ పొందిన వారికి బస్సు పాస్ ,స్కాలర్షిప్, హాస్టల్ ఫెసిలిటీ కలదు అన్నారు. ఐటిఐ, ఏటీసీ శిక్షణ పూర్తి అయిన అనంతరం ఆన్ జాబ్ ట్రైనింగ్, అప్రెంటిన్షిప్ తో పాటు, జాబు మేళ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
- Advertisement -