- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీహార్ రాజధాని పాట్నాలో నేపాల్‌కు చెందిన యువతిపై ఓ ప్రయివేట్ బస్సులో లైంగికదాడి జరిగింది. బాధితురాలికి తెలిసిన నేపాలీ భాష మాట్లాడి నమ్మకాన్ని చూరగొన్న నిందితుడు, ఆమె నిస్సహాయతను ఆసరాగా తీసుకుని ఉద్యోగం పేరుతో మోసగించి దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు కార్తీక్ రాయ్, సహచరుడు సునీల్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఆగస్టు 4న జరిగిన ఈ ఘటనలో ఉపయోగించిన బస్సు స్వాధీనం చేసుకోగా, దర్యాప్తు కొనసాగుతోంది.
- Advertisement -