Wednesday, August 13, 2025
EPAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్దొంగ ఓట్లతో గెలిచిన బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి

దొంగ ఓట్లతో గెలిచిన బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి

- Advertisement -

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి దేశం మొత్తం మద్దతు పలకాలి 
రాజ్యాంగ శక్తుల ఐక్యతతోనే ప్రజాస్వామ్య రక్షణ
ప్రజాసంఘాల నాయకులు పీక కిరణ్, అక్కల బాపు
నవతెలంగాణ – కాటారం

ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించే ఓట్లను తారుమారు చేసి దొంగ ఓట్లతో గద్దెనెక్కిన బిజెపి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఇవిఎం ల ద్వారా నాశనం చేయడంతో పాటు దొంగ ఓట్లను నమోదు చేసి, అక్రమ పద్ధతిలో గెలిచి రాజ్యమేలుతున్న బిజెపి ప్రభుత్వం వెంటనే గద్దె దిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కిరణ్ డిమాండ్ చేశారు.  దొంగ ఓట్ల కుంభకోణాన్ని కళ్ళకు కట్టినట్లు బట్టబయలు చేసిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి దేశంలోని ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులు అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు.

భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న శక్తులన్నీ ఐక్యం కావాలని, ఇవిఎం లు రద్దయ్యేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. గత 20 సంవత్సరాల నుండి బ్యాంసెఫ్ లాంటి సంస్థలు ఇవిఎం ల రద్దు కోసం పోరాటం చేస్తున్న  దొడ్డి దారిన అధికారంలోకి రావడానికి అలవాటుపడిన పాలకవర్గాలు ఇవిఎం లను వీడడం లేదని అన్నారు. దేశంలో బలమైన ప్రతిపక్ష స్థానంలోనున్న కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నేడు ఐవిఎం లను రద్దు చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని పోరాడడం మంచి పరిణామమని అన్నారు. ఇవిఎం రద్దుతో పాటు దొంగ ఓట్లను తొలగించడం కోసం జరిగే పోరాటంలో రాజ్యాంగ శక్తులు రాహుల్ కు అండగా నిలవాలని కిరణ్ పిలుపునిచ్చారు. దొంగ ఓట్ల కుట్ర, రాజ్యాంగ రక్షణ, ఇవిఎం ల రద్దుకై గ్రామ గ్రామాన జరిగే చైతన్య పోరాటంలో ప్రజా సంఘాలు ముందు వరుసలో ఉంటామని తెలిపారు. దొంగ ఓట్ల కుట్రలో భాగమైన అధికారులను అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు అక్కల బాపు యాదవ్. శ్రీనివాస్. తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Advertisement
Advertisement
Ad