- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79ఏండ్లు గడిచినా దేశంలో పేదల, ధనికుల మధ్య అంతరం తగ్గలేదని మాజీ శాసనసభ్యులు నంద్యాల నరసింహరెడ్డి అన్నారు. బీజేపీ పాలనలో ఈ అంతరం మరింత పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని..హైదరాబాద్ లోని నవతెలంగాణ దినపత్రిక ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను నంద్యాల నరసింహ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పత్రిక ఎడిటర్ రాంపల్లి రమేష్, సంస్థ సీజీఎం ప్రభాకర్, బుక్ హౌజ్ ఎడిటర్ కె.ఆనందాచారి, జనరల్ మేనేజర్లు, బోర్డు సభ్యులు, మేనేజర్లు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -