- Advertisement -
నవతెలంగాణ- రాయపోల్
రాయపోల్ మండల రామారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జాల దుర్గా ప్రసాద్ కూతురు నామకరణ వేడుకలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తప్పెట సుధాకర్, దౌల్తాబాద్ మండల అధ్యక్షులు పడాల రాములు, మండల నాయకులు పాల రామ గౌడ్, గోపాల్, మహేష్, చందు, యాదగిరి, లాలు,గణేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -