నవతెలంగాణ- నిజామాబాద్ సిటీ
నగరంలోని మలబార్ గోల్డ్ డైమండ్స్ లో సరికొత్త రత్నాభరణాల సేకరణ అయిన ‘‘వ్యాన ‘‘ ను సోమవారం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వినియోగదారులు ఆవిష్కరించారు. వజ్రంతో ప్రేరేపితమైన తేజస్సును, వర్ణరంజితమైన శక్తివంతమైన రత్నాలను 18, 22 క్యారెట్ల బంగారంతో ఎంతో శ్రద్దగా వ్యానను సుందరంగా రూపొందించారు. వ్యాన అనేది కేవలం ఆభరణాల సేకరణ మాత్రమే కాదని, ఇది మహిళ స్పూర్తి అనేక చాయులకు ప్రశంస అని స్టోర్ ఇంచార్జి అక్షయ్ మీడియాతో వివరించారు. వ్యానలోని ప్రతి రత్నం, మహిళలోని బలం, దయ, వ్యక్తిత్వం కథను చెబుతుందన్నారు. వ్యాన ఆభరణాలు ధరించే మహిళల మాదిరిగానే, ప్రతి ఆభరణం నిజంగా ప్రత్యేకమైన తేజస్సును ప్రసరింపజేస్తుందన్నారు. ప్రతి ఫెస్టివల్ లో భాగంగా వినియోగదారులు అన్ని రకాల రత్నాలు, అస్ కట్ వజ్రాల ఆభరణాల తరుగు చార్జీలపై 25 శాతం వరకు తగ్గింపు పొందవచ్చని అన్నారు.
మలబార్ గోల్డ్ డైమండ్స్ లో వ్యాన ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES