- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షంలో భారీ వినాయక విగ్రహాన్ని పాత బస్తీలో ట్రాక్టర్‌పై తీసుకెళ్తుండగా హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విద్యుత్ షాక్‌కు గురైన టోనీ (21), వికాస్ (20), నిఖిల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. టోనీ, వికాస్ మరణించారు. నిఖిల్ పరిస్థితి విషమంగా ఉంది.
- Advertisement -