- Advertisement -
కలెక్టర్ పమేలా సప్తతిని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
నవతెలంగాణ – కరీంనగర్
చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని కోరారు. యూరియా పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, అధికారులచే నిరంతర పర్యవేక్షణ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ అధికారులు ఎరువుల దుకాణాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, రైతులకు ఎరువుల లభ్యతపై సమాచారం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించాలని కోరారు.
- Advertisement -